calender_icon.png 24 November, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్యసాయి జయంతి వేడుకలు

24-11-2025 12:00:00 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి టౌన్, నవంబర్ 23 :  మానవ సేవే మాధవ సేవ అని నమ్మి ఎంతో మందికి సేవలు చేసిన సత్యసాయి భగవాన్ సమానుడే అని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.  ఆదివారం సత్యసాయి 100వ జన్మదినోత్సవం సందర్భంగా ఐ.డి. ఒ.సి ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ సత్యసాయి చిత్ర పటానికి పుష్పాలతో నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సత్యసాయి చేసిన సేవలు ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తి దాయకమని అన్నారు.  ప్రజా సేవకై ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక రకాల సేవలు అందించారని గుర్తు చేశారు. అందుకే నేడు సత్యసాయి జయంతిని నేడు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. 

సత్యసాయి చూపిన సన్మార్గంలో నడిచి ప్రతి ఒక్కరు ఇతరుల పట్ల ప్రేమ అభిమానం చూపిస్తూ తగిన సహాయం చేయగలిగితే మానవాళి సుఖసంతోషాలతో ఉంటారనీ సూచించారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసిల్దార్  రమేష్ రెడ్డి, సత్యసాయి జిల్లా కమిటీ  కన్వీనర్, సాయిరాం, సాయిరెడ్డి, నరహరి యూత్ కోఆర్డినేటర్, భాగ్యమ్మ మహిళా కోఆర్డినేటర్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.