24-11-2025 12:00:00 AM
కామారెడ్డి, నవంబర్ 23 (విజయ క్రాంతి) : కామరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మల్లికార్జున్ పటేల్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఆదివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని బూత్‌స్థాయి నుంచి బలపర్చేందుకు కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు.
ప్రజలతో మమేకమై వాటిని బలోపేతం కోసం చేయడం కోసం శ్రమించాలని సూచించారు.2029లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలంటే ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిర్వార్థంగా పనిచేయాలని సూచించారు.
అలాగే ప్రజలను చైతన్యవంతం చేస్తూ కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను ఎప్పటికప్పుడు వారికి అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. ఎన్నికైన నూతనంగా ఎన్నికైన డీసీసీ అధ్యక్షుడికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట సాయి పటేల్ ముగ్డే వార్ శ్రీనివాస్ వున్నారు.