calender_icon.png 29 September, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు సేవ చేయడంలోనే సంతృప్తి

29-09-2025 12:34:22 AM

మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ 

దౌల్తాబాద్,సెప్టెంబర్ 28:దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ మండల పరిధిలోని గాజులపల్లి, శేరిపల్లి బందారం,లింగాయపల్లి తండాల్లో వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వంద మంది వృద్ధులకు దోతులు, అంగీలు అందజేయగా,50 మంది మహిళలకు తువాళ్లను పంపిణీ చేశారు.పండగ సంతోషాన్ని అందరికీ పంచుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఆయనతో పాటు బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సయ్యద్ రహీమొద్దీన్,జనార్ధన్ రెడ్డి,జోడు నవీన్,హరిబాబు,నాగులు,మంగ్యా తదితరులున్నారు.