calender_icon.png 29 September, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్‌కు ఘనస్వాగతం

29-09-2025 12:00:00 AM

తుర్కయంజాల్, సెప్టెంబర్ 28:<బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా నియమితు లైన ఇబ్రాం శేఖర్కి తుర్కయంజాల్లో కార్య కర్తలు ఘనస్వాగతం పలికారు. ఇబ్రహీం పట్నంలోని భారత్ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన అభినందన సభకు వెళ్తూ తుర్కయంజాల్లో ఇబ్రాం శేఖర్ కాసేపు ఆగారు. బీఎస్పీ మున్సిపల్ మాజీ అధ్యక్షుడు వద్దిగళ్ల బాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బెహెన్ జీ కుమారి మాయావతి ఆశీస్సులతో తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. బహుజనవాదులంతా ఏకమై, రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ స్టేట్ కో ఆర్డినేటర్ అంతర్సింగ్, స్టేట్ కో ఆర్డినేటర్ బాలయ్య, జిల్లా కార్యదర్శి గ్యార మల్లేశ్, నాయకులు లపంగి రాజు, రమణ, శ్యామ్, రంజిత్, కుమార్, జానీ, సురేష్, రవి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.