13-08-2025 12:48:19 AM
ఇటీవల ‘కింగ్‌డమ్’లో విజయ్ దేవరకొండ అన్నగా మెప్పించారు హీరో సత్యదేవ్. ఆయన కథానాయకుడిగా మరో చిత్రం వస్తోంది ప్పుడు. ‘రావు బహదూర్’ అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నాయి. ఇదొక ఓ సైకలాజికల్ డ్రామా. ఓ రాజవంశం నేపథ్యంలో సాగే కథతో వెంకటేశ్ మహా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాలో సత్యదేవ్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. ఆగస్టు 15న థియేటర్లలో, ఆగస్టు 18న డిజిటల్‌లో ‘నాట్ ఈవెన్ ఏ టీజర్’ అనే స్పెషల్ వీడియో రిలీజ్ కానున్నట్టు మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని 2026 వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్ సాయి; డీవోపీ: కార్తీక్ పర్మార్; సమర్పణ: మహేశ్‌బాబు, నమ్రత శిరోద్కర్ జీబీఎం ఎంటర్‌టైన్‌మెంట్; నిర్మాతలు: చింతా గోపాలకృష్ణరెడ్డి, అనురాగ్‌రెడ్డి, శరత్‌చంద్ర; రచనాదర్శకత్వం, ఎడిటర్: వెంకటేశ్ మహా.