calender_icon.png 14 August, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రకాళి వచ్చేది ఆ రోజే

13-08-2025 12:46:33 AM

ఇటీవల ‘మార్గన్’ చిత్రంతో అలరించిన విజయ్ ఆంటోనీ ఇప్పుడు ‘భద్రకాళి’ సినిమాతో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించారు. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించిన రగ్గడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కానుంది.

ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, స్పిరిట్ మీడియా రిలీజ్ చేస్తున్నాయి. ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృష్ణపాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బాట్, రియా జితు, మాస్టర్ కేశవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: షెల్లీ కాలిస్ట్; సంగీతం: విజయ్ ఆంటోని; యాక్షన్: రాజశేఖర్; ఎడిటర్: రేమండ్ డెరిక్; ఆర్ట్: శ్రీరామన్.