calender_icon.png 17 August, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బసెల్ 3 బాండ్లతో ఎస్బీఐ 7,500 కోట్ల సమీకరణ

19-09-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: సంస్థాగత ఇన్వెస్టర్లకు బసెల్ 3 ప్రామాణిక బాండ్లను జారీచేసి రూ. 7,500 కోట్లు సమీకరించినట్టు బుధవారం ఎస్బీఐ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. తమ బాండ్ల ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించిందని, ఇష్యూకు మూడు రెట్లు అధికంగా బిడ్స్ వచ్చాయని బ్యాంక్ తెలిపింది. ప్రావిడెంట్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్‌లు బాండ్ల బిడ్డింగ్‌లో పాల్గొన్నాయని పేర్కొంది. 15 ఏండ్ల కాలపరిమితితో జారీచేసిన ఈ బాండ్లకు 7.33 కూపన్ రేటును ఎస్బీఐ ఆఫర్ చేసింది.