calender_icon.png 30 September, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

30-09-2025 12:25:52 AM

వనపర్తి, సెప్టెంబర్ 29 ( విజయక్రాంతి ) : స్థానిక సంస్థల ఎన్నికలు ఎంపీటీసీ, జడ్పిటిసి, గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని విడుదల చేసారు. ఎంపీటీ సీ జెడ్పిటిసి ఎన్నికలను రెండు విడతలలో నిర్వహింకానున్నారు.మొదటి విడత నోటిఫికేషన్ అక్టోబర్ 9న విలువడటం జరుగు తుంది అదే రోజు నుంచి నామినేషన్లు ప్రా రంభమై 11వ తేదీన మూగుస్తుంది.

అక్టోబర్ 23న మొదటి విడతకు ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో విడత అక్టోబర్ 13న నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుంది. అక్టోబర్ 15న నామినేషన్లు వేయుటకు చివరి తేదీ. రెండవ విడత ఎన్నికలు అక్టోబర్ 27 తేదీన నిర్వహించడం జరుగుతుంది. రెండు విడతలకు కలిపి ఓట్ల లెక్కింపు నవంబర్ 11వ తేదీ న ఉదయం 8 గంటల నుండి ప్రారంభమవుతాయి. వనపర్తి జిల్లాలోని 15 మండలా లకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తా రు.

ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలు  మొదటి విడతలో గోపాల్పేట, ఘనపూర్, పెబ్బేర్, పెద్దమందడి, రేవల్లి, శ్రీరంగాపూర్, వనపర్తి, ఎదుల మండలాలకు నిర్వహిస్తారు.రెండో వి డతలో అమరచింత, ఆత్మకూర్, చిన్నంబావి, కొత్తకోట, మదనాపూర్, పాన్గల్, వీపనగండ్ల మండలాల్లో ఎన్నికలు ఉంటాయి. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికలను మొ త్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 

వనపర్తి జిల్లాలోనీ 268 గ్రామ పంచాయతిలు 2436 వార్డులకు ఎన్నికల ను రెండవ, మూడవ విడతలలో నిర్వహించనున్నారు. రెండవ విడత గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ అక్టోబర్ 21న వె లువడుతుంది. ఎన్నికలు నవంబర్ 4న నిర్వహిస్తారు.

ఉదయం 7 గంటల నుండి మధ్యా హ్నం 1.00 గంట వరకు ఎన్నికలు నిర్వహించి మధ్యాహ్నం 2.00 గంటల నుండి లెక్కింపు ప్రారంభమవుతుంది. రెండవ విడతలో ఆత్మకూరు అమరచింత కొత్తకోట గోపాల్పేట ఘనపూర్ పెద్దమందడి మదనాపూర్ మండలాలకు సంబంధించిన 135 గ్రామ పంచాయతీలు, 1216 వార్డులకు సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తారు.