30-09-2025 12:23:56 AM
కలవకుర్తి సెప్టెంబర్ 29: కల్వకుర్తి పట్టణానికి వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో శరన్నవరాత్రు ఉత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. సోమవారం అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ లు శ్రీశైలం, సత్యం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి ఉత్సవ కమిటీ సభ్యులు శాలువా మెమెంటోతో సన్మానం చేశారు. కార్యక్రమంలో నా యకులు గోవర్ధన్, విజయ్ గౌడ్, మనోహర్ రెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి, ఉత్సవ కమిటీ సలహాదారు వాస శేఖర్, కమిటీ ప్రధాన కార్యదర్శులు గుండ్ల రేవంత్, దాచేపల్లి నితిన్, కోశాధికారి లు పోల గిరిబాబు,పాల్గొన్నారు.