calender_icon.png 16 August, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలరించిన సాంస్కృతిక నృత్యాలు

15-08-2025 11:58:38 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు, వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల పనితీరును తెలుపుతూ ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరిని ఆకట్టుకున్నాయి.సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోని ఏడు పాఠశాలల విద్యార్థులు చేసిన వివేందరసాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోని ఏడు పాఠశాలల ఒక ప్రత్యేకమైన దృక్పథంతో విద్యార్థులు చేసిన విభిన్న నృత్యాలు అందరిని ఆలోచింపచేసాయి.

వాంకిడి కేజీబీవీ పాఠశాల విద్యార్థులు, ఆసిఫాబాద్ గిరిజన మహిళ గురుకుల పాఠశాల విద్యార్థినులు, పోస్ట్మెట్రిక్ బాలికల పాఠశాల విద్యార్థులు సెయింట్ మేరీ పాఠశాల విద్యార్థులు, స్థానిక జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాల విద్యార్థులు, మోడీ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులు, గిరిజన క్రీడ పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. ఆయా పాఠశాలల విద్యార్థులను అభినందిస్తూ వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేస్తున్న అభివృద్ధి పనులను తెలిపే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు.

వీటిలో భాగంగా 11 శాఖలు వారి వారి అభివృద్ధిని వివరిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మండలి డిప్యూటీ చైర్మన్ సందర్శించి పలు విషయాలు అడిగి తెలుసుకోవడంతో పాటు, పలు సూచనలు సలహాలు చేశారు. ఏర్పాటు చేసిన స్టాల్స్ లో మహిళా సాధికారిక కేంద్రం, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ, ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ, వ్యవసాయ శాఖ, అటవీ శాఖ, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ, పాఠశాల విద్యాశాఖ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, పశు వైద్య పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ స్టాల్స్ ఉన్నాయి.జిల్లాలోని 346 స్వయం సహాయక సంఘాల మహిళలకు 20 కోట్ల 71 లక్షలు చెక్కును డిఆర్డిఓ దత్తరావు ద్వారా ముఖ్య అతిధి బండ ప్రకాష్ అందజేశారు.