calender_icon.png 16 August, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జడ్చర్లలో ఆలస్యంగా ఎగిరిన జెండా..

16-08-2025 12:00:00 AM

- ఏండ్ల తరబడి వస్తున్న ఆనవాయితీ తప్పిందంటూ జడ్చర్లలో తీవ్ర చర్చ

- పాత బజార్ వద్ద ఆలస్యంగా జెండాను ఎగరవేసిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

- దారిలో బస్సు ప్రమాదాన్ని పరిశీలించినందుకు ఆలస్యమైందన్న ఎమ్మెల్యే 

మహబూబ్ నగర్ ఆగస్టు 15 (విజయ క్రాంతి) : జిల్లా జడ్చర్ల నియోజకవర్గం కేంద్రంలోని పాత బజార్ గాంధీ విగ్రహం వద్ద 7.05 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఢిల్లీ ఎర్రకోటలో ఏడు గంటలకు జెండా ఆవిష్కరణ జరిగిన అనంతరం ఏడు గంటల ఐదు నిమిషాలకు జడ్చర్లలో జెండాను ఎగరవేయడం ఆనవాయితీ గా కొ నసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 1962 నుంచి జడ్చర్ల తొలి ఎమ్మెల్యే కొత్త కేశవులు గాంధీ విగ్రహం వద్ద జెండాను ఆవి ష్కరించి ఆనవాయితీకి శ్రీకారం చుట్టారు.

గత మాజీ మంత్రి, జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వరకు కూడా ఈ ఆనవాయితీ కొనసాగినట్లు స్థానికులు చెబుతు న్నారు. అయితే శుక్రవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి గాంధీ విగ్రహం వద్దకు 7.30 గంటలకు చేరుకోవడం తో జెండాను ఆలస్యంగా ఎగురవేయాల్సి వ చ్చింది. ప్రజా ప్రతినిధులు లేదా అధికారులు ప్రోటోకాల్ ప్రకారం సమయానికి జెం డా ఎగురవేయని పక్షంలో అందుబాటులో ఉన్న అధికారులు , ప్రజా ప్రతినిధులు జెం డాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించాలని పలువురు పేర్కొంటున్నారు.

అలా చేయకుండా ఎమ్మెల్యే వచ్చేవరకు వేచి ఉం డి జెండాను ఆలస్యంగా ఎగరవేయడంతో జడ్చర్లలో చర్చనీయాంశం అయింది. ఈ చర్చకు ముగింపు పలికాలని ఉద్దేశంతో విజయ క్రాంతి దినపత్రిక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని ఫోన్ ద్వారా సంప్రదించింది. నాటి నుంచి వస్తున్న ఆనవాయితీ ఉన్న విష యం తమకు తెలుసని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీని గౌరవించాలని వచ్చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే మాచా రం దగ్గర లారీని ఢీకొట్టిన బస్సు సంఘటన కనిపించడంతో అక్కడ పరిస్థితిని ప్రత్యేకంగా పరిశీలించడం జరిగిందన్నారు. 

ప్రమాదం కళ్ళముందు కనిపించడంతో ఎవరికీ ఎలాంటి అపాయం జరిగిందో అనే ఉద్దేశంతో అక్కడ వివరాలు తెలుసుకొని, అవసరమైన సూచనలు సలహాలు ఇచ్చి వెంటనే విచ్చేసి జెం డాను ఎగుర వేయడం జరిగిందని తెలియజేశారు. ఇందులో ఎలాంటి సందేహం లే దని, కొందరు అనవసరంగా ఇలాంటి రాద్ధాంతాలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.