24-05-2025 07:19:46 PM
ఆకస్మికంగా విత్తనాల దుకాణాలను తనిఖీ చేసిన అధికారులు..
కామారెడ్డి (విజయక్రాంతి): లైసెన్స్ ఉన్న విత్తన దుకాణాల్లో విత్తనాలను కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ అరుణ(Agriculture Department Additional Director Aruna) అన్నారు. శనివారం కామారెడ్డి మండలంలో పలు విత్తన దుకాణాలను భాన్స్వాడ డివిజన్ నుంచి విత్తన తనిఖీ బృందం ఏడిఏ. కే. అరుణ, నిజాంసాగర్ వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్ లు తనిఖీ చేశారు. రైతులకు నాణ్యతమైన విత్తనాలు, విత్తన చట్టం పరిధిలో లోబడి అమ్మాలని సూచించారు.
అందరూ విత్తన డీలర్లు తెచ్చుకున్న విత్తన స్టాక్స్ ఏప్పటికప్పుడు రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. ఏ స్టాక్స్, ఏ కంపెనీ స్టాక్ తెచ్చుకున్నారో వాటి సోర్స్ సర్టిఫికెట్స్ లు, బిల్స్, ఇన్వైస్ పెట్టుకోవాలన్నారు. రైతులకు అమ్మిన విత్తనాలకు రసీదు తప్పకుండా ఇవ్వాలని పేర్కొన్నారు. రైతులు ప్యాకింగ్ లేని విత్తనాలు కొనొద్దు అని తెలిపారు.మధ్య దళారుల దగ్గర కాకుండా లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గరే విత్తనాలు కొనాలనీ తెలిపారు. విత్తన డీలర్లూ ఎవరైనా పత్తి విత్తనాలను అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పవన్, డీలర్లు పాల్గొన్నారు.