calender_icon.png 6 November, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

06-11-2025 01:36:08 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 5(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలకు  చెందిన విద్యార్థులు డోంగ్రి ఇషాంత్, నాగోసే మహేష్, జాడి సంజయ్, మౌల్కర్ మహేష్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరఫున ఎస్‌జిఎఫ్ అండర్-17 హ్యాం డ్బాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యా రు.

ఈ పోటీలు ఈ నెల 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు మహబూబ్నగర్ జిల్లా కోస్గి, నారాయణపేట్లో జరగనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ జూలూరి యాదగిరి తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను జిల్లా విద్యాధికారి  దీపక్ తివారి,, పాఠశాల క్రీడల సమాఖ్య కార్యదర్శి బి. వెంకటేశ్, వైస్ ప్రిన్సిపాల్ అబ్దుల్ రహీం, పీడీ కోట యాదగిరి, పీఈటీ ఎస్. ప్రసాద్ మరియు అధ్యాపక బృందం అభినందించారు.