16-08-2025 12:43:58 AM
జిల్లా ఉత్తమ తహసీల్దారుగా పెద్దెములు వెంకటేష్ ప్రసాద్ కు అవార్డు
తాండూరు, 15,ఆగస్టు (విజయక్రాంతి) 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుక లు నియోజకవర్గంలోని పెద్దేముల్ యాలాల బషీరాబాద్ తాండూరు మరియు తాండూర్ మున్సిపల్ పరిధిలో ఘనంగా జరిగాయి.ఊరు వాడల్లో ప్రభుత్వం మరియు ప్రైవేటు కార్యాలయాల్లో వాణిజ్య వ్యా పార సంస్థలలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు మువ్వన్నెల జెండను ఆవిష్కరించారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు మనోహర్ రెడ్డి జెండాను ఎగ రవేశారు.వికారాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పెద్దముల్ తహసిల్దార్ వెంకటేష్ ప్రసాద్ ఉత్తమ జిల్లా తహసిల్దారుగా పరిగి, తాండూర్ శాసన సభ్యులు మనోహర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చేతుల మీదుగా అవార్డునుతీసుకున్నారు.