calender_icon.png 17 July, 2025 | 1:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆడపిల్లల ఆత్మరక్షణకు కరాటే అవసరం

14-07-2025 12:19:57 AM

బీజేపీ నాయకురాలు కృష్ణప్రియ మల్లారెడ్డి 

మేడ్చల్ అర్బన్, జూలై 13: ఆడపిల్లలకు ఆత్మరక్షణకు కరాటే అవసరమని బిజెపి నాయకురాలు కృష్ణప్రియ మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మేడ్చల్ కెఎల్‌ఆర్ లోని జేవియర్ ఫంక్షన్ హాల్ లో టైక్వాండో బెల్ట్ టెస్ట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణప్రియ మల్లారెడ్డి మాట్లాడుతూ ఆడపిల్లలు తమని తాము రక్షించుకోవడానికి టైక్వాండో లాంటి శిక్షణను తప్పనిసరిగా నేర్చుకోవాలన్నారు.

బెల్ట్ టెస్టులో ప్రమోషన్ పొందిన పిల్లలకు తన చేతుల మీదుగా బ్రౌన్స్, సిల్వర్, గోల్ పతకాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్, ఉమా నగర్, కొంపల్లి తదితర ప్రాంతాల నుంచి క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కరాటే మాస్టర్లు నాగరాజు, శ్రీనివాస్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.