calender_icon.png 24 January, 2026 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

24-01-2026 12:18:03 AM

నూతనకల్  జనవరి 23 : 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని దేశ పౌరుడిగా ఓటు హక్కు కలిగి ఉండడం గర్వకారణం అని ఆయన అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాములు నాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.