27-10-2025 01:28:12 AM
ఘట్ కేసర్, అక్టోబర్ 26 (విజయక్రాంతి) : రైతు నేస్తం 21వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ వ్యవ సాయ శాస్త్రవేత్త డాక్టర్ ఐవీ సుబ్బారావు పేరిట వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన ఘట్ కేసర్ మున్సిపల్ అంకుశాపూర్ కు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు సీనియర్ జర్నలిస్ట్ పిట్టల శ్రీశైలంకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రైతునేస్తం పురష్కారాలు-2025 ప్రదానం చేశారు.
ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రాంగణంలో ఉదయం 11 గంటలకు ముప్పవరపు ఫౌండేషన్, రైతు నేస్తం ఫౌండేషన్ ల నిర్వహణలో ఈకార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు నేస్తం ఫౌండేషన్ అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావు, ముప్పవరపు ఫౌండేషన్ ఆద్యక్షులు హర్షవర్దన్, వ్యవసాయ శాస్త్రవేత్త కొసరాజు చంద్రశేఖర్, రెవిన్యూ నిపుణులు భూమి సునీల్, ఛత్తీస్ ఘడ్ ఔషద మెుక్కల సంస్థ డైరెక్టర్ జె.వి. రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఐవీ సుబ్బారావు పేరిట ప్రకృతి వ్యవ సాయంలో విశేష కృషి చేస్తున్న అంకుశాపూర్ కు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు పిట్టల శ్రీశైలంను ఘట్ కేసర్ మాజీ ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి, ప్రకృతి సేద్య రైతులు జిట్ట జ్యోతి, బాల్ రెడ్డి, మాజీ ఎంపిటిసి సభ్యులు జంపాల రమేష్, మాజీ కౌన్సిలర్ మేకల పద్మారావు, బిఆర్‌ఎస్ నాయకులు వరికుప్పల లింగస్వామి, సత్యం, సామాజిక కార్యకర్తలు చందుపట్ల జీవన్ రెడ్డి, జెల్లీ కిషన్, కొమ్మిడి మురళీధర్ రెడ్డి, కుంటోళ్ళ యాదగిరి, చిలుక గణేష్, బోగ రాజేశ్వర్ తదితరులు అభినందించారు.