13-07-2024 12:13:05 PM
హైదరాబాద్: శేరిలింగంపల్లి బీఆరెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ తన అనుచరులతో పాటు కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు సీఎం సమక్షంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ తదితరులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ లోకి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. శుక్రవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.