24-05-2025 12:06:53 AM
హనుమకొండ,(విజయక్రాంతి): రాష్ట్ర సినిమా ఫోటోగ్రఫీ, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదినం సందర్భంగా కె.వి.ఆర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిర్వహించిన, ఫౌండేషన్ సభ్యులు ఈ సందర్భంగా కె.వి.ఆర్ ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పటల్( ఎంజీఎం), మిషన్ హాస్పిటల్ చిన్నపిల్లల వార్డ్ లో, అదాలత్ సెంటర్లో అనాధ పిల్లలకు హాస్పిటల్లో ఉంటున్న పేషెంట్స్ బంధువులకు, ఆకలితో అలమటిస్తున్న అనాధలకు, ప్రతి ఒక్కరికి జన్మదినం సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు చైర్మన్ నమ్మిండ్ల వెంకటేష్. వైస్ చైర్మన్ బిగుళ్ల సురేష్, ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.