calender_icon.png 16 August, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలదిగ్బంధంలో ఏడుపాయల

16-08-2025 12:12:04 AM

ఆలయం చుట్టూ వరద నీరు

పాపన్నపేట(మెదక్)(విజయక్రాంతి): మెదక్ జిల్లా నాగుసానిపల్లి గ్రామ పరిధిలోని ఏడుపాయల వన దుర్గా భవాని ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అమ్మవారి ఆలయం ముందు మంజీరా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్నది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు విడుదల కావడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆలయం చుట్టూ వరద నీరు చేరింది. నది పాయలు ఉధృతంగా ప్రవహించడంతో ఆలయం చుట్టూ పాయాలలో భారీగా నీరు ప్రవహిస్తుంది.