16-08-2025 12:11:22 AM
హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి) : దొంగ ఓట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా తమ పద్ధతిని మార్చుకోవడం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. దేశానికి స్వాతంత్య్రం వద్దని చెప్పిన బీజేపీ వాళ్లే.. ఇప్పుడు కుర్చీ కోసం విచ్ఛిన్నకరంగా పాలిస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్య్రం దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో మహేశ్‌గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.
ప్రాణత్యాగాలు చేసిన ఎందరో మహానుభావుల వల్లే స్వాతం త్య్రం వచ్చిందన్నారు. గాంధీ, నెహ్రూలు త్యాగాలు చేస్తే.. బీజేపీ నాయకులు బ్రిటీష్ వాళ్ల అడుగులకు మడుగులు వత్తారని ఆరోపించారు. పెద్దల కోసం పేదల నడ్డి విరుస్తు న్నారని, డీజిల్, పెట్రోల్ ధరలు అవకాన్ని అంటుతున్నాయన్నారు. ఓట్ల దొంగతనం జరిగిందని రాహుల్‌గాంధీ ఆధారాలతో సహా నిరూపించారని చెప్పారు.
బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించారని పేర్కొన్నారు. మహారాష్ర్టలో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో అర్థం చేసుకోవాలన్నారు. ఒక సింగల్ బెడ్ రూమ్ ఇంట్లో 45 ఓట్లు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్, కుసుమకుమార్, ఎంపీ అనిల్ యాదవ్, పిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్ పాల్గొన్నారు.