calender_icon.png 16 August, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల సంక్షేమ కమిషన్‌ చైర్మన్ కోదండ రెడ్డిని కలిసిన టీఎన్జీవోస్ జిల్లా ప్రతినిధులు

16-08-2025 12:12:34 AM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రానికి 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి టీఎన్జీవోస్ ప్రతినిధులు శుక్రవారం కలిసి స్వాగతం పలికారు. జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో వారి బృందం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహములో కోదండ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి ఘన స్వాగతం తెలిపారు.