calender_icon.png 12 October, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అఫ్గన్ మంత్రి ప్రెస్‌మీట్‌లో మా ప్రమేయం లేదు!

12-10-2025 02:12:52 AM

  1. ఆ దేశ రాయబార ప్రాంగణం భారత్ పరిధిలోకి రాదు..

భారత విదేశాంగశాఖ 

మహిళా జర్నలిస్టులకు ప్రవేశం లేకపోవడంపై స్పందన

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ‘అఫ్గనిస్థాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ మీడియా సమా వేశం వ్యవహారంలోభారత ప్రభుత్వ ప్రమే యం లేదు. ముంబైలోని అఫ్గన్ కాన్సలేట్ నుంచి కొందరు జర్నలిస్టులకు మాత్రమే ఆహ్వానాలు అందాయి. ఆఫ్గన్ రాయబార కార్యాలయ ప్రాంగణం భారత ప్రభుత్వ పరిధిలోకి రాదు’ అని శనివారం భారత విదే శాంగశాఖ ప్రకటన విడుదల చేసింది.

ఢిల్లీలోని అఫ్గనిస్థాన్ రాయబార కార్యాలయం లో శుక్రవారం ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ నిర్వహించిన మీడి యా సమావేశానికి మహిళా జర్నలిస్టులకు ఆహ్వానం లేకపోవడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. సమావేశానికి పురుష జర్నలిస్టులు మాత్రమే హాజరయ్యారని, మహిళా జర్నలిస్టులను ఎందుకు అనుమతించలేదని పలవురు జర్నలిస్టులు, ఏఐసీసీ నేతలు సోషల్‌మీడియా వేదికగా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందిం చలేదని ప్రశ్నించారు. ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ స్పందిస్తూ.. ‘మహిళా జర్నలిస్టులు మీడియా సమావేశానికి రాకుండా అడ్డుకోవడమంటే, ఇది మహిళా జర్నలిస్టులకు జరిగిన అవమానం’ అని ప్రధాని మోదీని నిలదీశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందిస్తూ.. ‘ప్రధాని మోదీకి ఎన్నికలప్పుడే మహిళలు, మహిళల హక్కులు గుర్తుకొస్తాయా?’ అం టూ ప్రధాని మోదీని ప్రశ్నించారు.