22-08-2025 12:31:59 AM
నిజామాబాద్ ఆగస్టు 21: (విజయ క్రాంతి) : నిజామాబాద్ వినాయక ఉత్సవాలలో భాగంగా వినాయక నిమజ్జనానికి సంబంధించి జిల్లాకేంద్రంలో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఈ మేరకు గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లను గురువారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి నగరంలోని వినాయక్ నగర్‌లో ఉన్న గణేష్ నిమజ్జన బావిని పరిశీలించారు.
బావి ప్రాంతంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా మున్సిపల్ సిబ్బంది, పోలీసులు పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. గణేష్ నిమజ్జనం జరిగే ప్రధాన రహదారులను పరిశీలించారు. ఆయన వెంట వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా (నుడా) ఛైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రత్నాకర్, ఖుద్దుస్ తదితరులున్నారు.