22-08-2025 12:31:31 AM
రూ.25వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
ఆర్మూర్, ఆగస్టు 21 (విజయ క్రాంతి) : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఆర్టీఏ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎంవీఐ గుర్రం వివేకానంద రెడ్డి, ఆయన డ్రైవర్ తిరుపతిలు ఆర్టీవో ఏజెంట్ నుంచి 25 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డారు. నిజా మాబాద్‌కి చెందిన ఆర్టీవో ఏజెంట్ అర్మూర్‌లో డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు చేయి స్తుంటాడు. ఆయన ఫైళ్లు ఆర్మూర్ ఎంవీఐ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్నాయి.
తన ఫైళ్లను క్లియర్ చేయాలని వివేకానంద రెడ్డిని కోరగా 25 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. అంత ఇచ్చుకోలేనని చెప్పినప్పటికీ, డబ్బులు ఇస్తేనే ఫైళ్లుగా క్లియర్ చేస్తా మని, భవిష్యత్తులో కూడా ఎలాంటి ఫైళ్లు పెండింగ్‌లో ఉండవని చెప్పినట్లు తెలుస్తోం ది. దీంతో డబ్బులు ఇవ్వలేక బాధితుడు ఏసీ బీ అధికారులను ఆశ్రయించాడు.
అతని నుంచి ఎంవీఐ లంచం డబ్బులు తీసుకోగానే ఏసీబీ అధికారులు ఎంవీఐ కార్యాలయంపై దాడి చేసి డ్రైవర్ తిరుపతిని, ఎంవీఐ వివేకానంద రెడ్డిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 25వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించారు. ఎంవీఐ నివాసం, అతని బంధువుల ఇళ్లలో దాడులు నిర్వహించామన్నారు. కాగా, గతంలోనూ సదరు ఎంవీఐపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి.