calender_icon.png 1 November, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టూకే రన్ తో స్నేహభావం పొందుతుంది

31-10-2025 10:58:48 PM

కొల్చారం,(విజయక్రాంతి): సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మండల కేంద్రమైన కొల్చారంలో ఎస్సై అహ్మద్ మోయుద్దిన్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది 'రన్ ఫర్ యూనిటీ' 2కె రన్ ను శుక్రవారం ఉదయం మండల కేంద్రమైన కొల్చారం లో నిర్వహించారు. ఈ టూ కే రన్ వల్ల ఐక్యత భావం పెంచడంతోపాటు శారీరక మానసిక వికాసం కలగడంతో పాటు క్రమశిక్షణ ను ఏర్పరచుకొని చార్యకి రకంగా మానసికంగా దృఢంగా తయారవుతారన్నారు.

ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో రన్నింగ్ వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు వయస్సుతో భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఉదయం సాయంత్రం రన్నింగ్, వాకింగ్, ఇతర వ్యాయామాలు చేసి శరీర పట్టుత్వాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా టూకే రన్ లో విభాగాల వారీగా విజేతలుగా నిలిచిన వారికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో మెడల్స్ అందజేశారు సీనియర్ విభాగంలో ప్రథమ బహుమతి సీనియర్ జర్నలిస్టు నాగభూషణం, ద్వితీయ, తృతీయ బహుమతులు సీనియర్  కాంగ్రెస్ నాయకులు శేఖర్, ఎంఈఓ సత్యనారాయణరావు లకు లభించాయి. 2కే రన్ లో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు వేరువేరుగా బహుమతులను అందజేశారు.