calender_icon.png 14 September, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘శంకర నేత్రాలయం’ ఆసుపత్రి ప్రారంభం

14-09-2025 12:52:19 AM

హాజరైన ఎమ్మెల్యే దానం నాగేందర్, కోట నీలిమ 

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సనత్‌నగర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి కోట నీలిమ శనివారం ‘శంకర నేత్రాలయం’ కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ.. మరోసారి పేద ప్రజలకు సేవ చేస్తున్నందుకు శంకర నేత్రాలయం సేవలను ప్రశంసించారు.

సనత్‌నగర్ నియోజకవర్గంలో అంధత్వాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తానని డాక్టర్ రవీందర్‌గౌడ్ హామీ ఇచ్చారు. జర్నలిస్టులు, వారి కుటుంబాలకు కంటి సమస్యలను చికిత్స చేస్తామని రవీందర్‌గౌడ్ హామీ ఇచ్చారు. ఇప్పటివరకు శంకర నేత్రాలయం కంటి ఆసుపత్రి 30,000 కంటి ఆపరేషన్లను ఉచితంగా నిర్వహించింది. 3 లక్షల మందికి ఉచితంగా కళ్ల జోడులను పంపిణీ చేసింది.