14-09-2025 12:54:20 AM
దక్షిణాసియాతో పాటు భారతదేశంలోనే తొలిసారిగా ఆల్ట్రా-ఫాస్ట్ క్యూ-డాట్ అబ్లేషన్ విధానాన్ని తీసుకొచ్చి కార్డియాలజీ రంగంలో శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించింది. శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ అట్రియల్ ఫైబ్రిలేషన్ (ఏఎఫ్) చికిత్స కోసం అత్యాధునిక అల్ట్రా-ఫాస్ట్ క్యూ-డాట్ అబ్లేషన్ టెక్నాలజీని విజయవంతంగా ప్రవేశపెట్టింది.
ఆల్ట్రాఫాస్ట్ క్యూడాట్ అబ్లేషన్ పద్ధతిని ప్రొఫెసర్ శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ చైర్మన్ చీఫ్ కార్డియాలజిస్ట్, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ వీఎస్ రామ చంద్ర నేతృత్వంలో నిపుణుల బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఇప్పటివరకు ఏడుగురు రోగులు ఈ సాంకేతికతతో చికిత్స పొందారు. ఇది భారతీయ హృదయ శాస్త్రంలో ఒక మైలురాయిగా నిలిచింది. క్యూ-డాట్ అబ్లేషన్‌ను, సాంప్రదాయ అబ్లేషన్‌తో పోలిస్తే స గం సమయంలోనే శస్త్రచికిత్స పూర్తి చేయగలుగుతున్నాం.
దీని వల్ల రోగికి తక్కువ ఒత్తిడి, తక్కువ ప్రమాదం, వేగవంతమైన కోలిక సాధ్యమవుతుందని డాక్టర్ వీఎస్ రామచంద్ర తెలిపారు. ‘మా రోగులకు అత్యాధునిక కార్డియాక్ కేర్ అందించడంలో ఇది ఒక ముందడుగు. ఇలాంటి ఆవిష్కరణలను భారతదేశంలో మొదటగా ప్రవేశపెట్టడం మాకు గర్వకారణం’ అని రామచంద్ర వెల్లడించారు. ఈ విజయంతో, భారతదేశానికి అత్యాధునిక గ్లోబల్ కార్డియాక్ ఇన్నోవేషన్‌ను అందించడమే కాకుండా,
రోగులకు ఆరోగ్యాన్ని అందించడంలో శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ మరో ముందడుగు వేసింది. శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్‌లో కేవలం వ్యాధి చికిత్స అందించడమే కాకుండా ఆధునిక సాంకేతికత, కరుణతో కూడిన సేవల ద్వారా రోగుల జీవితాలను మార్చడమే తమ లక్ష్యమని చైర్మన్ డాక్టర్ వీఎస్ రామచంద్ర తెలిపారు.
అట్రియల్ ఫైబ్రిలేషన్ చికిత్సలో విప్లవం
అట్రియల్ ఫైబ్రిలేషన్ అనేది గుండె అసమానంగా, వేగంగా కొట్టుకొనే పరిస్థితి. ఇది స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్, అనేక సమస్యలకు దారితీసే ప్రమాదం కలిగి ఉంటుంది.
శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ గురించి..
హైదరాబాద్‌లోని శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ఒక అగ్రగామి మల్టీ-స్పెషాలిటీ హెల్త్‌కేర్ సంస్థ. రోగుల ఆరోగ్యం, శ్రేయస్సు ప్రధాన లక్ష్యంగా ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందిస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో, సమగ్ర చికిత్స, సహానుభూతి కలిగిన సేవలను అందించడం ఈ ఆసుపత్రి ప్రత్యేకత.
మీడియా బ్రీఫింగ్, రోగుల అనుభవాలు..
ఆదివారం మీడియా సమావేశంలో డాక్టర్ వీఎస్ రామచంద్ర ఈ అధునాతన సాంకేతికతను వివరించి, దాని పనితీరును చూపించనున్నారు. అనంతరం చికిత్స పొందిన రోగులు తమ అనుభవాలను పంచుకుంటారు.
క్యూడాట్ అబ్లేషన్ సిస్టమ్ ఆధునిక సాంకేతికతతో ప్రయోజనాలు:
అధిక శక్తి, ఉష్ణోగ్రత నియంత్రిత రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీతో గుండెలోని లోపభూయిష్ట ఎలక్ట్రికల్ సిగ్నళ్లను ఖచ్చితంగా సరిచేస్తుంది.
సాధారణ అబ్లేషన్ పద్ధతితో పోలిస్తే సమయం తక్కువ, రేడియేషన్ ప్రభావం కూడా తగ్గుతుంది.
రోగులు వేగంగా కోలుకోవడంతో పాటు, తక్కువ సమస్యలు ఎదుర్కొని, దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలను పొందుతారు.