05-12-2025 01:23:56 AM
మెగాస్టార్ చిరంజీవి మాస్ -అండ్ -ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’తో అలరించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను షైన్‌స్క్రీన్స్, గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న విక్టరీ వెంకటేశ్ పాత్రకు సంబంధించి షూటింగ్ ఇటీవలే పూర్తయింది.
మరోవైపు ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ను టీమ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక మేకర్స్ ఇప్పుడు సెకండ్ సింగిల్ ‘శశిరేఖ’ గురించి ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు.
ఈ పాట ప్రోమో డిసెంబర్ 6న విడుదల అవుతుండగా, పూర్తి గీతం ఇదే నెల 8న రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో చిరంజీవి, నయనతార ఆకట్టుకున్నారు. 2026 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా, సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా పనిచేస్తుండగా, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ డైరెక్షన్‌ను పర్యవేక్షిస్తున్నారు.