30-09-2025 12:45:51 AM
శంకర్ పల్లి, సెప్టెంబర్ 29: శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని రైల్వేస్టేషన్ సమీపాన గల విఠలేశ్వర ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల పర్వదినాలను పురస్కరించుకుని జై భవాని యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలో యెనిమిది రోజులుగా ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు సోమవారం నుండి భవాని దీక్షలతో పూజా కార్యక్రమాలు ప్రారంభమై, ప్రతి రోజు విఠలేశ్వర ఆలయంలో భవాని అమ్మవారికి ప్రత్యేక పూజ లు, హెూమాలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఒక్కరికి ఎలాంటి అసౌకర్యం జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈసారి తాము 25వ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నా మని, పట్టణంలోని ప్రతి ఒక్కరూ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని, అమ్మవారి ఆశీస్సులు పొందాలని తెలిపారు.
దుర్గామాత దీక్షలో ఉన్న భక్తులందరికీ ప్రతి రోజు రాత్రి అల్పాహారం ఏర్పాటు చేశారు. విజయదశమి రోజున వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రావణ సంహారం ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా చేస్తున్నామని తెలిపారు. పట్టణంలోని దాదాపు పదివేల మంది ఈ రావణ సంహార కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జై భవాని