calender_icon.png 23 September, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

23-09-2025 12:42:09 AM

  1. ప్రారంభించిన ఈవో దీప్తి, అర్చకులు

శైలపుత్రిదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం 

అలంపూర్ ,సెప్టెంబర్ 22 దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రముఖ ఐదవ శక్తిపీఠమైన అలంపురం శ్రీ జోగుళాంబ దేవి ఆలయాల్లో అమ్మవారి బ్రహ్మోత్సవాలు మొదటి రోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

వి విధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ముందుగా అమ్మవారి ఆలయం సమీపాన ఉన్న తుంగభద్ర నదిలో పుణ్య స్నా నమాచరించి తుంగభద్ర నదికి దీపాలను వెలిగించి అమ్మవా రి,బాలబ్రహ్మేశ్వర స్వామి,వార్లను దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులను పొందారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా భ క్తులకు తాగునీరు, ఉచిత ప్రసాదం, అన్నదానం వంటి వసతులను కల్పించినట్లు ఆలయ ఈవో దీప్తి తెలిపారు.

జోగులాంబ దేవి అమ్మవారి ఆలయంలో మొదటి రోజు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో ఆలయ అర్చకులు, అమ్మవారి ఆలయంలో చండీ హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ చండీ హోమం కార్యక్రమంలో ఆలయ ఈవో దీప్తి,

పాలకమండలి ధర్మకర్తలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించా రు.ప్రతి సంవత్సరం మాదిరే చండీ హోమంలో ఆలయ అర్చకులకు పట్టు వస్త్రాలను అందజేశారు.  శైలపుత్రిదేవిగా దర్శనం: నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటిరోజు జోగులాంబ అమ్మవారు శైలపుత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక హారతిని ఇచ్చారు.

మాలధారణ స్వీకరించిన భక్తులు.. 

నవరాత్రి ఉత్సవాలను సందర్భంగా ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి జోగులాంబ దేవి,మరియు భవానీ మాత యొక్క మాలధారణను స్వీకరించారు.ఆలయ అర్చకులు అమ్మవారి ముందు వేద మంత్రోచ్ఛరణల నడుమ భక్తిశ్రద్ధలతో భక్తులకు మాలధారణ స్వీకరణ కార్యక్రమం చేపట్టారు.