23-09-2025 12:41:54 AM
జిల్లా ఎస్పీ నరసింహ
సూర్యాపేట, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి) : మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. ప్రభుత్వ టీచర్, గంజాయి నిర్మూలన అవగాహన సామాజిక కార్యకర్త ప్రభాకర్ డ్రగ్స్ నిర్మూలన పై అవగాహన కల్పించడానికి నిర్వహింస్తున్న బైక్ ర్యాలీ కార్యక్రమానికి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జండా ఊపిరి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో గంజాయి, డ్రగ్స్ అనేవి అత్యంత ప్రమాదకరంగా మారాయని యువత దీని బారిన పడి బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటివి మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండి బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలన్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటి పదార్థాల రవాణా, వినియోగం, సరఫరా మొదలగు వాటి గురించి పోలీసు వారికి డయల్ 100 ద్వారా సమాచారం అందించాలన్నారు.
యువత విద్యార్థులు ఈ డ్రగ్స్ నిర్మూలనలో అంబాసిడర్స్ గా పని చేయాలని ఎవరైనా వీటికి ప్రభావానికి లోనైన వారు ఉంటే వారి సమాచారాన్ని కూడా పోలీసులకు అందించాలని సూచించారు. తుప్పరి సెలవులలో మాదకద్రవ్యాల నిర్మూలలపై అవగాహన కల్పించేందుకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న ప్రభాకర్ ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సూర్యాపేట డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్, ఆర్ ఐ నారాయణ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, పోలీస్ సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్, ఆర్‌ఎస్‌ఐ లు ఎం.అశోక్, సాయిరాం, కె.అశోక్, సిబ్బంది ఉన్నారు.