calender_icon.png 26 September, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లి ప్రేమను పంచండి

26-09-2025 12:43:12 AM

- చిన్నారులకు లోటు రాకుండా చూసుకోండి

-జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 25(విజయక్రాంతి): శిశుగృహ పిల్లలకు తల్లిలా ప్రేమను పంచాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. గురువారం శిశుగృహాను ఆకస్మికంగా తని ఖీ చేయడంతో పాటు అక్కడి పరిసరాలను పరిశీలించారు. పిల్లల హెల్త్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఒక్కోక్కరికి చిన్నారి హెల్త్ ప్రొఫైల్ పరిశీలించి, వయ స్సు వారిగా పిల్లలని వేరు చేసి వారి గ్రోత్ పై మానిటరింగ్ చేయాలని సూచించారు.

బరువు తక్కువ ఉన్న చిన్నారులకు స్పెషల్ డైట్ ఇవ్వాలన్నారు. పిల్లల బట్టల విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ఇంటి వాతావరణంలో పిల్లలను పెంచాలని, ప్రత్యేకగా ఏర్పాటు చేసిన పార్కులో పిల్లలను ఆడించాలని చెప్పారు. శిశుగృహ చిన్నారులకు అవసరమైన సౌకర్యాల కోసం నిధులు సమకూరుస్తానని చెప్పారు. అనంతరం స్టేట్ హోం ప్రాంగణంలో నిర్మిస్తున్న చిల్డ్రన్ హోమ్ భవన నిర్మాణ పనులను, మరమ్మత్తులు చేసిన మీటింగ్ హాల్ పనులను పరిశీలించారు.

ప్రాంగణంలో పాతబడిపోయిన అర్బన్, రూరల్ సిడిపిఓ ఆఫీసుల గురించి ఆరా తీశా రు. అనంతరం మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం,వాలీ బాల్ అకాడమీ,స్విమ్మింగ్ పూల్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించి స్టేడియం లో నిర్వహించే క్రీడంశాలను గురించి తెలుసు కొన్నారు.స్విమ్మింగ్ పూల్ చుట్టూ పరిశుభ్రం గా ఉంచాలని సూచించారు. వాలీ బాల్ అకాడమీ విద్యార్థులతో మా ట్లాడి భోజనం, వసతి సౌకర్యాలు గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో డిడబ్ల్యుఓ జరీనా బేగం, సీడిపీఓ శైల శ్రీ, డిసిపిఓ నర్మద, ఛైల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రాములు, శిశుగృహ సిబ్బంది ఉన్నారు.