calender_icon.png 26 September, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం టెండర్లకు వేళాయే..

26-09-2025 12:43:17 AM

  1. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎక్సైజ్ శాఖ

ఈసారి టెండర్ ఫీజు 3 లక్షలు

జిల్లాలో 47 వైన్ షాపులకు దరఖాస్తులు

నిర్మల్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రభుత్వం అధికారులకు వచ్చి న తర్వాత మొట్టమొదటిసారిగా మద్యం దుకాణాలకు టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 25 నుంచి డిసెంబర్ 1 వరకు ఈ ప్రక్రియ ముగించే విధంగా షెడ్యూలను ప్రకటించింది. నిర్మల్ జిల్లాలో మొత్తం 47 మద్యం షాపులు ఉండగా రిజర్వేషన్ల కేటగిరీలో ఈ మద్యం షాపులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయనున్నట్టు తెలిపారు 2025 27 రెండేళ్ల కాలపరిమితిగాను గత ప్రభుత్వం టెండర్ ఫీజు రెండు లక్షలు ఉండగా ఈ ప్రభు త్వం అదనంగా ఒక లక్ష పెంచి మూడు లక్ష లు చేసింది.

47 షాపుల్లో 38 ఓపెన్ కేటగిరి లో గౌడలకు 3 ఎస్సీలకు 5 ఎస్టిలకు ఒకటి రిజర్వేషన్ కేటగిరిలో కేటాయించారు జిల్లా లో షాపుల కేటాయింపుకు గురువారం రిజర్వేషన షాప్ గుర్తింపు డ్రా నిర్వహించగా 26 నుంచి వచ్చే నెల 18 వరకు దరఖాస్తులను స్వీకరించరున్నారు. అక్టోబర్ 33 లైసెన్స్ లో జారీకి  కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు ఎంపికైన వారికి ఆర్ ఎస్ ఈ టి చెల్లింపుకు 24, 25 తేదీల్లో అవకాశం ఇస్తారు. డిసెంబర్ ఒకటి నుంచి జిల్లాలో కొత్త షాపులు ప్రారంభం  కానున్నాయి

కొత్త షాపులకు ఇలా..

జిల్లా వ్యాప్తంగా 47 మద్యం షాపులు ఉం డగా వీటి లైసెన్సుల గడువు ఈ ఏడాది నవంబర్తో పూర్తవుతున్నది. దీంతో కొత్తగా లైసె న్సులను జారీ చేసేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. దుకాణాల సంఖ్య, రిజర్వేషన్లు యథాతధంగా కొనసాగనున్నాయి. దరఖాస్తు రుసుం ఈ సారీ గతంలో కంటే లక్ష రూపాయలు పెంచి రూ.మూడు లక్షలుగా (నాన్ రిఫండబుల్), స్పెషల్ రీటెయిల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఎస్‌ఆర్‌ఈటీ)ను రూ.5 లక్షలుగా నిర్ధారించారు.

దరఖాస్తు ఫీజును డీడీ రూపంలో కానీ, చలాన్ రూపంలో కానీ చెల్లించవచ్చు. జిల్లా  ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు ఉదయం 11 నుంచి సాయం త్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తారు. ఓ వ్యక్తి ఎన్ని దుకాణాల కైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండడంతో జిల్లాలో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచన వేస్తున్నారు.

ఎన్ని షాపులకైనా దరఖాస్తు 

ఒకే వ్యక్తి రాష్ట్రంలోని ఎక్కడైనా, ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వుడ్ దుకాణాలకు ఆయా వర్గాల వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్రా నిర్వహించి లైసెన్సులు జారీచేస్తారు. వార్షిక ఆర్‌ఎస్‌ఈటీ (రీటెయిల్ షాప్ ఎక్సైజ్ ట్యాక్స్) ఆరు సమానా వాయిదాల్లో చెల్లించవచ్చు. మొత్తం ఆర్‌ఎస్‌ఈటీలో 25 శాతం బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది.

జిల్లాలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు దుకాణాలను అనుమతిస్తారు. 21 సంవత్సరాల కన్నా తక్కువ వయసువారు,ఎక్సైజ్ చట్టం ప్రకారం శిక్ష పడినవారు, గతంలో ఎక్సైజ్ రెవెన్యూ ఎగ్గొట్టిన వారు, కోర్టు ద్వారా దివాలా తీసినట్టు ప్రకటించినవారు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది.