calender_icon.png 16 December, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐసీసీ ఆదివాసీ చైర్మన్ విక్రాంత్ భూరియాను కలిసిన శోభన్ బాబు

16-12-2025 12:29:41 AM

మహబూబాబాద్, డిసెంబర్ 15 (విజయక్రాంతి): ఏఐసీసీ అనుబంధ అఖిల భా రత ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ విక్రాంత్ భూ రియాను జాతీయ కోఆర్డినేటర్గా ఇటీవల తెలంగాణ నుండి నియమితుడై , కర్ణాటక రా ష్ట్రానికి ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం అ య్యగారిపల్లికి చెందిన భుక్య శోభన్బాబు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భం గా విక్రాంత్ భూరియా మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో నివసిస్తున్న ఆదివాసీ సము దాయాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్ర త్యేక దృష్టి సారించి, వారి హక్కుల పరిరక్షణ కోసం క్రియాశీలకంగా పని చేయాలని సూ చించారు.

అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీని ఆదివాసీ ప్రజల మధ్య మరింత బలోపేతం చే యడం కోసం సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. తనకు కే టాయించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని భుక్య శోభన్బాబు పేర్కొన్నారు.