calender_icon.png 16 December, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించండి

16-12-2025 12:30:15 AM

సర్పంచులను అభినందించిన ఎమ్మెల్సీ చల్లా , ఎమ్మెల్యే విజయుడు

అలంపూర్, డిసెంబర్ 15: గ్రామాల అభివృద్ధికి గ్రామస్తులతో కలిసి ముందుకు సాగాలని వారు ఇచ్చిన అవకాశాన్ని నూతన సర్పంచులు సద్వినియోగం చేసుకొని గ్రామాల అభివృద్ధికి బాసటగా నిలవాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు అన్నారు.రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులు ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిని కర్నూలులోని ఎమ్మెల్సీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

రాజోలి  మండల పరిధిలోని తూర్పు గార్లపాడు సర్పంచ్ వెంకటేశ్వరమ్మ,తుమ్మిళ్ల సర్పంచ్ అడివప్ప, పచ్చర్ల సర్పంచ్ కాశపోపు బేబీతో పాటు గ్రామస్తులు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చల్లా ఎమ్మెల్యే విజయుడు నూతన సర్పంచులకు పూలమాలలు వేసి శాలువ కప్పి సన్మానించారు.

అనంతరం సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ... గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని గ్రామస్తులతో కలిసిమెలిసి పలు అభివృద్ధి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.