06-10-2025 12:00:00 AM
- చురుకైన నేతలకు సముచిత స్థానం దక్కే అవకాశం
-జెడ్పిటిసి సీటును ఆశించి బంగపడ్డ వెంకటేష్
-ఎంపీపీ సీట్ ఆశించి భంగపడ్డ మరో నేత సుధాకర్ రెడ్డి
- రిజర్వేషన్ల షాక్ తో దిక్కుతోచని పరిస్థితుల్లో నేతలు
- పార్టీ పక్కన పెట్టిందా? పార్టీ పటిష్టతకు పని చేస్తారా?
మహబూబ్ నగర్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): ఆశతో ఉన్న నేతలకు రిజర్వేషన్ ఖ రారు గట్టి షాక్ ను ఇచ్చాయి. పాలమూరు నియోజకవర్గ పరిధిలోని నియోజకవర్గం అంతా ఆశించిన నేతలకు, రిజర్వేషన్లు షాక్ కు గురిచేస్తూ వారిని అయోమయంలో పడివే సింది. తమ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో కొనసాగుతామని ఆశించిన వారికి గడ్డు పరిస్థితి ఎదురైంది.
దీంతో వారి రాజకీయ భవి తవ్యం గందరగోళం నెలకొంది. పాలమూ రు నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించిన ఎన్పీ వేంకటేష్ ను బుద్ధారం సుధాకర్ రెడ్డి లకు ఇదే పరిస్థితి ఎదురయింది. హన్వా డ జెడ్పిటిసి గా గెలుపొంది జిల్లా పరిషత్ చైర్మన్ గా పదవిని ఆశించాలని జోరుగా ప్ర చారం చేసుకున్న ఎన్పీ వెంకటేష్ కు జెడ్పి చైర్మన్ మహిళా, జడ్పిటిసి సైతం మహిళ రిజర్వు కావడంతో ఈయనకు ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది.
ఈ రిజర్వేష న్ల ప్రక్రియతో ఎంపీ వెంకటేష్ పరిస్థితి అ యోమయంగా మారింది. రాజకీయంగా అ వకాశం లేకపోయినా పైకి మాత్రం తాను పోటీ చేయడం లేదని ప్రచారం చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పార్టీ అ ధికారంలో ఉన్న ఎన్పీ వెంకటేష్ కు ఏ పదవి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎంపీ వెంకటేష్ పార్టీలోకి వచ్చి రెండేళ్లు పూర్తికాకముందే పార్టీని వీడి బిజెపిలోకి వెళ్లారు. ఎ న్నికల ముందు మళ్లీ బిజెపిని వీడి కాంగ్రెస్ లోకి చేరారు. దీంతో ఎన్పీ వెంకటేష్ పట్ల పార్టీ అంత సానుకూలంగా లేనట్లు తెలుస్తుంది.
ఇటు పార్టీ పరంగా చూస్తే డిసిసి అ ధ్యక్షుడు రేసులో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వకపోవడంతో అది కూడా ఆశలపై నీరు చల్లినట్లే. ఇటు పార్టీ పరంగా గానీ అటు స్థానిక సంస్థల కూడా ఎలాంటి అవకాశాలు లేకుండా పార్టీలో కొనసాగుతారా లేక తప్పుకుంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎన్పీ వెంకటేష్ పట్ల పార్టీ సుముఖత లేనట్లు పార్టీ వర్గాలు చెబుతున్న మాటే ఇది. ఇదిలా ఉంటే హన్వాడ మండలం బు ద్ధారం గ్రామానికి చెందిన బుద్ధారం సుధాకర్ రెడ్డి సైతం ఎంపిటిసిగా గెలుపొంది ఎం పీపీగా కొనసాగాలనేది ఆశ కానీ రిజర్వేషన్లు అందుకు విరుద్ధంగా రావడంతో అయోమయంలో పడ్డాడు. ఇతని పట్ల పార్టీ కూడా సుముఖత లేనట్లు తెలుస్తుంది ఎందుకంటే ఇతని పట్ల అనేక నెగిటివ్ సమాచారం రావడంతో పక్కన పెట్టినట్లు తెలుస్తుంది.
ఇతను కూడా టిఆర్‌ఎస్ లో ఉండి ఎన్నికల ముం దు బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రా వడంతో పార్టీ అంత సపోర్టుగా లేనట్లు తెలుస్తుంది. ఈసారి కొత్త నేతలకు అవకాశం ఇ చ్చి ఉత్సాహవంతులుగా తీర్చిదిద్దాలని పార్టీ పటిష్టంగా ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే పార్టీకి అనుకూలంగా రిజర్వేష న్లు వెలువైనట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. దీంతో సీనియర్ నేతలు పార్టీలో ఉ న్న రాజకీయంగా ఎలాంటి పదవులు లేవు కాబట్టి వారంతా కార్యకర్తలకు కొనసాగుతారా? తప్పుకుంటారా? అనేది ప్రశ్నార్థకం గా మారింది.
గ్రామాల్లో కూడా చాలా ఇదే పరిస్థితి..
సర్పంచిగా ఎంపిటిసిగా పోటీలో ఉంటామని జోరుగా ప్రచారం చేసుకున్న నేతలకు రిజర్వేషన్లు గట్టి శాఖను ఇచ్చాయి. వారికి ఆపోజిట్ గా రిజర్వేషన్లు రావడంతో వారం తా పండుగ వేళ దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. మేము పార్టీ కోసం బాగా శ్రమిం చాం కానీ రిజర్వేషన్ పరంగా అవకాశం రాకపోవడంతో వారంతా మనస్థాపానికి గురై సైలెంట్ మూడ్ లోకి వెళ్లారు. వీరికి పార్టీ ఏ విధమైన పదవులు ఇస్తుందో లేక వదులుకుంటుందో మనం వేచి చూడవలసిందే.