calender_icon.png 16 December, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల విధులకు డుమ్మా కొట్టిన 73 మందికి షోకాజ్ నోటీసులు

16-12-2025 12:43:18 AM

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) డిసెంబర్ 15 (విజయక్రాంతి):ఎన్నికల విధులు అత్యంత కీల కమైనవని, చట్టబద్ధమైన బాధ్యతలని 2వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరు అయిన సిబ్బందికి షోకాజ్ నోటీస్ జారీ చేసినట్లు జయశంకర్ భూ పాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. 2 వ దశ జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల విధులకు గైర్హాజరు అయిన 73 మంది పిఓ, ఓపిఓలకు సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎన్నికల విధులకు హాజరు కాకపోవడం తీవ్రంగా పరిగణించబడుతుందని ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలో రెండో దశ పోలింగ్ సమయంలో విధులకు హాజరు కాని సిబ్బందికి షో కాజ్ నోటీసులు జారీ చేసి, ఎందుకు ఎన్నికల సంఘం నిబంధనలు మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. నిర్దేశిత గడువులోపు సరైన వివర ణ ఇవ్వని పక్షంలో ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 17వ తేదీన జరుగనున్న 3వ దశ ఎన్నికలకు విధులు కేటాయించిన సిబ్బంది తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని, గైర్హాజరయితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.