calender_icon.png 16 December, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నగదు బహుమతులు

16-12-2025 12:44:49 AM

ఎర్రుపాలెం డిసెంబర్ 15 (విజయ క్రాంతి):అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా ఎర్రుపాలెం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నగదు బహుమతులను ఇచ్చారు. స్థానిక ఎస్ జె కే యం జూనియర్ కాలేజ్ నందు జరిగిన సమావేశంలో గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో అచ్యుతమ ఫలితాలు సాధించిన మండలంలో మొదటి రెండవ స్థానాల్లో మార్కులు సంపాదించిన విద్యార్థులకు నగదు బహుమతులను ఇచ్చారు.

మొదటి బహుమతికి 2016 రూపాయలు, రెండవ బహుమతికి 1016 రూపాయల బహుమతులను భాస్కర్ స్కూల్ నందు చదివిన విద్యా ర్థులకు అందించారు. ఈ సమావేశంలో ఎర్రుపాలెం వాసవి క్లబ్ అధ్యక్షులు గ కొప్పు పరమేశ్వరావు మాట్లాడుతూ వాసవి క్లబ్ మండల వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను చేస్తుందని అందులో భాగంగా మండల వ్యాప్తంగా చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం నగదు బహుమ తులను అందిస్తున్నామని పేర్కొన్నారు.

ఇంకా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. గత సంవత్సరం ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు పొందిన గుమ్మడి రాజుల శ్రీలేఖ తల్లిదండ్రులను వాసవి క్లబ్ తరఫున సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో దోపకుంట్ల పుల్లారావు, దొడ్డ అశోక్, కేతపల్లి నరసింహారావు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.