05-12-2024 10:42:21 PM
ముందస్తు అరెస్ట్ అక్రమంః కమలరాజు
ఖమ్మం,(విజయక్రాంతి): ఎర్రుపాలెం మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో మౌళిక వసతులను పరిశీలించేందుకు గురువారం బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి వెళుతున్న ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, పార్టీ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమలరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని,స్ధానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా గురుకులాల్లో అల్లర్లు, గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తు అరెస్ట్‌లు చేశామని స్ధానిక ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు.
ముందస్తు అరెస్ట్ అక్రమం: లింగాల కమలరాజు
గురుకులంలోని మౌళిక వసతులను పరిశీలించేందుకు వెళుతున్న తనను,బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం అన్యాయం, అక్రమని లింగాల కమలరాజు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు పాముకాట్లు, కలుషిత ఆహారంతో ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ,సమస్యను పక్కదారి పట్టిస్తుందని విమర్శించారు. సమస్యలు బయటకు వస్తాయనే భావించి,ముందస్తు అరెస్ట్‌లకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎర్రుపాలెం మండల అధ్యులు పంబి సాంబశివరావు, మాజీ జెడ్పీటీసీ శీలం కవిత, మ ండల యువజన అధ్యక్షులు కె.సాంబశివరావు, మాజీ ఎంపిటిసిలు సూరంనేని రామకోటేశ్వరరావు, సంక్రాంతి కృష్ణారావు, యన్నం శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.