06-01-2026 12:00:00 AM
రెండు మ్యాచ్‌లు ఆడనున్న స్టార్ బ్యాటర్
ఇవాల్టి మ్యాచ్‌లలో పలువురు స్టార్ ప్లేయర్స్
జైపూర్ , జనవరి 5 : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు స్టార్ బ్యాటర్ శ్రేయా స్ అయ్యర్ విజయ్ హజారే ట్రోఫీలో ఆడబోతున్నాడు. మంగళవారం హిమాచల్ ప్రదేశ్‌తో జరిగే మ్యాచ్‌కు ముంబై జట్టును శ్రేయాస్ నడిపించబోతున్నాడు. శార్థూల్ ఠా కూర్ గాయంతో దూరమైన నేపథ్యంలో శ్రే యాస్ అయ్యర్‌కు కెప్టెన్సీ అప్పగిస్తూ ఎంసీ ఏ నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన శ్రేయాస్ ఇటీవలే బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్ కూడా పూ ర్తి చేసుకున్నాడు.
అయితే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైనప్పటకీ అతను ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఆడగలిగితేనే ఫిట్ నెస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వనున్నట్టు సీఓ ఈ తెలిపింది. మంగళవారం హిమాచల్‌ప్రదేశ్‌తోనూ, జనవరి 8న పంజాబ్‌తో మ్యాచ్ లో బరిలోకి దిగుతాడు.
కాగా ఈ రెండు మ్యాచ్‌లూ అటు ముంబైకి, ఇటు శ్రేయాస్‌కు కీలకం. మరోవైపు మంగళవారం జరిగే విజ య్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లలో పలువురు స్టార్ ఆటగాళ్లు ఆడబోతున్నారు. కేఎల్ రా హుల్, కరుణ్ నాయర్, పడిక్కల్, ఇషాన్ కిష న్, సంజూ శాంసన్, సిరాజ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, గిల్, పంత్, అక్షర్ పటేల్ , హార్థిక్ పాండ్యా వంటి ప్లేయర్స్ దేశవాళీ వన్డే టోర్నీ ఆడుతున్నారు.