06-01-2026 12:00:00 AM
ఇంగ్లాండ్ 384, ఆసీస్ 166/2
సిడ్నీ, జనవరి 5 : యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఇంగ్లాండ్‌కు ఆస్ట్రేలియా ధీటుగా బ దులిస్తోంది. హెడ్ దూకుడయిన బ్యాటింగ్‌తో రెండోరోజు ఆసీస్‌దే పైచేయిదా నిలి చింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 384 పరుగులకు ఆలౌటైంది. రూట్ 160 పరుగులతో అదరగొడితే..హ్యారీ బ్రూక్ 84, జేమీ స్మిత్ 46, విల్ జాక్స్ 27 పరుగులతో రాణించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభిం చిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. ట్రావిస్ హెడ్, వెదరాల్డ్ తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించారు. వెదరాల్డ్ (21) ఔటైనప్పటకీ లబూషేన్‌తో కలిసి ట్రావిడ్ హెడ్ దుమ్మురేపాడు.
87 బంతుల్లోనే 91 (15 ఫోర్లు) పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. లబూషేన్, హెడ్ రెం డో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. లబూషేన్ 48 (7 ఫోర్లు) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా రెండోరోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా 2 వికెట్లకు 166 పరుగులు చేసింది. హెడ్ 91, మైకెల్ నెసర్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ ఇంకా 218 పరుగులు వెనుకబడి ఉంది. కాగా యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 3 ఇప్పటికే కైవసం చేసుకుంది. వరుసగా మూ డు టెస్టుల్లో ఆసీస్ గెలిస్తే, బాక్సింగ్ డే టెస్టు లో ఇంగ్లాండ్ విజయం సాధించింది.