06-01-2026 12:00:00 AM
భారత్ యువ జట్టుదే వన్డే సిరీస్
బెనోనీ , జనవరి 5 : ప్రపంచకప్‌కు ముం దు భారత్ అండర్ 19 జట్టు దుమ్మురేపుతోంది. సౌతాఫ్రికా టూర్‌లో యూత్ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. వరుసగా రెండో వన్డేలోనూ సఫారీ అండర్ 19 జట్టు ను చిత్తుగా ఓడించింది. కిషన్ కుమార్ సింగ్ బౌలింగ్(4/46)కు తోడు వైభవ్ సూర్యవంశీ మెరుపులతో ఘనవిజయం సాధిం చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది.
96 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో జాసన్ రోవెల్స్ సెంచరీతో ఆదుకున్నాడు. భారత బౌలర్లలో కిషన్ కుమార్ సింగ్ 4 , అంబరీష్ 2, కనిష్క్ చౌ హాన్, దీపేశ్ దేవేంద్రన్, కిలాన్ పటేల్ ఒక్కో వికెట్ తీశారు, ఛేజింగ్‌లో భారత్ అండర్ 19 జట్టుకు ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 6.1 ఓవర్లలోనే 67 పరుగులు జోడిం చారు. ఆరోన్ జార్జ్(20) ఔటైనా..వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు.
సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. భారీ షాట్ల తో రెచ్చిపోయిన వైభవ్ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరింత దూకుడుగా ఆడే ప్రయత్నంలో వైభవ్ 24 బంతుల్లోనే 68 (1 ఫోర్, 10 సిక్స ర్లు) పరుగులకు వెనుదిరిగాడు. ఈ చిచ్చరి పిడుగు ఇన్నింగ్స్‌లో 64 పరుగులు బౌండరీలు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి.
తర్వాత వే దాంత్ త్రివేది 31 (4 ఫోర్లు), అభిగ్యాన్ కుందు 48 (3 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయాన్ని పూర్తి చేశారు. వర్షం కారణంగా మధ్యలో గంటసేపు మ్యాచ్ నిలిచిపోగా.. భారత్ లక్ష్యాన్ని 27 ఓవర్లలో 174 రన్స్‌కు కుదించారు. భారత్ యువ జట్టు 23.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. సిరీస్‌లో చివరి మ్యాచ్ బుధవారం జరుగుతుంది.