14-11-2025 12:00:00 AM
-ఫండింగ్ బిల్లుపై ట్రంప్ సంతకం
-43 రోజుల తర్వాత సాధారణ స్థితి
వాషింగ్టన్, నవంబర్ 13: అమెరికా చరిత్రలోనే అత్యధిక కాలం 43 రోజుల పాటు కొనసాగిన ఆర్థిక షట్‌డౌన్ ఎట్టకేలకు ముగిసింది. ప్రభుత్వ ఫండింగ్ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. బుధవారంసెనేట్ అమోదించిన ఈ బిల్లును ప్రతినిధుల సభ కూడా ఆమోదించడంతో ప్రతిష్టంభన వీడింది.
సెనేట్‌లో బిల్లు ముం దుకు కదలాలంటే 60 ఓట్లు అవసరం కా గా, మెజారిటీ రిపబ్లికన్లకు ఆ సంఖ్యాబలం లేదు. అయితే,8 మంది డెమోక్రాట్లు పార్టీ వైఖరికి వ్యతిరేకంగా రిపబ్లికన్లతో కలిసి ఓటు వేయడంతో బిల్లు పాస్ అయ్యేందుకు మా ర్గం సుగమమైంది. ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు 222 ఓట్ల తేడాతో ఆమోదం లభించింది.
ఈ బిల్లుపై సంతకం చేయడానికి ముందు ట్రంప్ మాట్లాడుతూ మన దేశం ఎన్నటికీ దోపిడీకి లొంగబోదనే స్పష్టమైన సందేశాన్ని ఈ రోజు మనం ప్రపంచా నికి పంపిస్తున్నాం అని అన్నారు. డెమోక్రాట్ల చర్యల కారణంగా అమెరికా కొంతకాలం ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొందని పేర్కొన్నారు. ఇది ఒక గొప్ప రోజు అని వ్యాఖ్యా నించారు.
వచ్చే ఏడాది జరిగి కాంగ్రెస్ ఎన్నికల్లో ఈ షట్‌డౌన్‌ను ప్రజలు మర్చిపోవద్దని ఆయన సూచించారు. ఇప్పటికే సెనెట్‌లో దీనికి ఆమోద ముద్ర పడింది. అనంతరం ఫండింగ్ బిల్లును ఆమోదించారు. షట్‌డౌన్ ప్రారంభమైన తర్వాత నుంచి ట్రంప్ ప్రభు త్వం చేపట్టిన ఫెడరల్ ఉద్యోగుల తొలగింపులను ఈ బిల్లు రద్దు చేయనుంది.