06-07-2025 07:59:50 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): భారతీయ జనతా జనసంఘ్ పార్టీ(Bharatiya Janata Jana Sangh Party) వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి పట్టణం స్థానిక టేకులబస్తీలో శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షురాలు దార కళ్యాణి మాట్లాడుతూ... శ్యాం ప్రసాద్ ముఖర్జీ ప్రముఖ జాతీయవాద నాయకుడన్నారు. ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్ పట్టణ ప్రధాన కార్యదర్శి కునిరాజుల అరవింద్, తాండూర్ మండల ఇంచార్జ్ మద్దర్ల శ్రీనివాస్, సీనియర్ నాయకులు జిదుల రాములు వేల్పుల రాజయ్య, గంపల చంద్రమౌళి పట్టణ ఉపాధ్యక్షులు గాండ్ల మహేష్, బాసబోయిన యుగేందర్, పట్టణ కోశాధికారి సంతోష అగర్వాల్ చింతకింది లావణ్య, బస్తీ వాసులు పాల్గొన్నారు.