06-07-2025 08:05:28 PM
ఎల్ హెచ్ పి ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు సిద్దునాయక్..
మిర్యాలగూడ: దామరచర్ల మండల పరిధిలోని గోనియా తండ గ్రామానికి చెందిన ధనావత్ దీప్లా మృతి బాధాకరమని ఎల్ హెచ్ పి ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు సిద్దు నాయక్(LHPS District President Siddhu Naik) అన్నారు. అనారోగ్యంతో మృతి చెందిన దీప్లా మృతదేహానికి ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దీప్లా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈయన వెంట మాజీ సర్పంచ్ కిషన్ నాయక్, ధనావత్ తార్ సింగ్, మాలోతు రమేష్, ధనావత్ హాతిరామ్, ధనావత్ లచ్చిరాం, ధనావత్ రమేష్ తదితరులు ఉన్నారు.