calender_icon.png 4 July, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ దుర్మరణం

04-07-2025 12:39:26 AM

సంగారెడ్డి, జూలై 3(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో సబ్ ఇన్స్పెక్టర్ మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా  చేర్యాల గేటు వద్ద బుధవారం అర్ధరాత్రి జరిగింది. సంగారెడ్డి పట్టణంలోని చాణక్యపురి కాలనీకి చెందిన ఎస్.ఐ రాజేశ్వర్ హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్.ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఆషాడమాసం బోనాల సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ బోనాల సందర్భంగా ఆలయం వద్ద బందోబస్తు నిర్వహించి రాత్రి తిరిగి వస్తుండగా చేర్యాల గేటు వద్దకు రాగానే రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సంగారెడ్డి  రూరల్ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రాజేశ్వర్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.

కాగా రాజేశ్వర్ 1990లో జిల్లా పోలీసు శాఖలో కానిస్టేబుల్ గా నియామకమై, ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్ లలో సాధారణ విధులతో పాటు స్టేషన్ రైటర్ గా విధులను నిర్వహించారు. అనంతరం జిల్లా టెక్నికల్, కంప్యూటర్ విభాగంలో సుమారు 15 సంవత్సరాలుగా ఐటి సెల్ ఇంచార్జ్ గా విధులను నిర్వహించారు. రాజేశ్వర్కు భార్య గాయత్రి, కుమారుడు, కూతురు ఉన్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

అంత్యక్రియల్లో పాల్గొన్న ఎస్పీ...

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్.ఐ రాజేశ్వర్ భౌతిక కాయానికి సంగారెడ్డిలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సంగారెడ్డి డీయస్పీ సత్యయ్య గౌడ్, ఆర్.ఐ రామారావు, ఆర్మూడ్ సిబ్బంది, ఐ.టి సెల్ సిబ్బంది పాల్గొన్నారు.