calender_icon.png 4 July, 2025 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి విద్యార్థులే రేపటి దేశ నిర్దేశకులు

04-07-2025 12:38:00 AM

రాజాపూర్ జూలై 3: విద్యార్థులు నేడు బాగా చదువుకుంటేనే రేపటి దేశ భవిష్యత్తుకు మార్గ నిర్దేశకులుగా అవుతారని ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులనుంచి రూ.54 లక్షల నిధులతో నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతరం ఎంపీ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద పిల్లలు ఉన్నత చదువులు చదివేందుకు ఒక విజన్ తో పిఎం శ్రీ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి 794 పాఠశాలల అభివృద్ధికి రెండు విడతలుగా రూ.4వందల 50 నిధులు అందించారని తెలిపారు.

ఇందులో 60 శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చాయని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయని తెలిపారు. పేద పిల్లలు ప్రతి ఒక్కరూ చదువుకొని ఉన్నత విద్యావంతులు కావాలని కోరారు. పేదరికం వల్ల ఏ ఒక్కరూ చదువుకు దూరంగా కావొద్దనే ఉద్యేశ్యంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల సౌకర్యాల కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నాయని అన్నారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయివేట్ బడులకు దీటుగా విద్య బోధన అందిస్తుంది అని తెలిపారు.దేశ అభివృద్ధి కి సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరం ఉందని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం కోసం ప్రతి పాఠశాల లో ఏఐ పరిజ్ఞానం కల్పిస్తుంది తెలిపారు. రేపటి బంగారు భవిష్యత్తు కోసం విద్యార్థులు ఇప్పటినుంచే బాగా కష్టపడి చదవాలని సూచించారు. అంతకుముందు జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని పెద్దయపల్లి గ్రామంలో నవోదయ విద్యాలయం నిర్మించేందుకు సహకారాన్ని అందించాలని కోరారు.

అందుకు కావలసిన ప్రభుత్వ భూమి ఉందని ఎంపీ కి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అశ్విని, వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్,ఏ ఈ ఓ సుధాకర్,ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ,ఎంపీఓ వెంకట్రాములు,నాయకులు గోవర్ధన్ రెడ్డి, శ్రీదర్ రెడ్డి, నరహరి, విక్రమ్ రెడ్డి,రమేష్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.