calender_icon.png 28 July, 2025 | 12:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

24-07-2025 07:14:05 PM

సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): పాఠశాలలు, ఉపాద్యాయులు ఎదురుకుంటున్న సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిర్ణయం మేరకు మండల కమిటీ అద్వర్యంలో డిప్యూటీ తహశీల్దార్ మమత(Deputy Tahsildar Mamata)కి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ రాములు, టిఎస్ యూటిఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు మునగాల కృష్ణారెడ్డీ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ఎదురుకుంటున్న సమస్యల పరిష్కారం కోసం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి బి.వంశీకృష్ణ, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షులు టీ. పవన్ కుమార్, టిఎస్ యూటిఎఫ్ సీనియర్ నాయకులు సిహెచ్. బిక్షంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.