calender_icon.png 26 January, 2026 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సిద్దార్థ వార్షికోత్సవం

26-01-2026 03:04:25 AM

ముకరంపుర, జనవరి 25 (విజయ క్రాంతి): కరీంనగర్ లోని సిద్ధార్థ విద్యాసంస్థల 30 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలు సంస్కృతి-2026 పేరుతో రెండు రోజుల పాటు అంబేద్కర్ స్టేడి యంలో ఘనంగా నిర్వహించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ దాసరి స్వప్న శ్రీపాల్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ఆరంభించారు.

విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. 30 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనము నిర్వహించారు. విద్యార్థుల పేరెంట్ గేమ్ గాలా-2025 క్రీడలలో గెలుపొందిన తల్లిదండ్రులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.